దివ్యాంగ యువతిపై బాలుడి లైంగికదాడి
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:32 AM
ములుగు జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడవరాని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగ యువతి లైంగికదాడికి గురైంది.
ములుగు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడవరాని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగ యువతి లైంగికదాడికి గురైంది. ఓ బాలుడు ఆమె ఇంట్లోకి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై ఆ ఇంట్లో నుంచి డబ్బులు అపహరించుకెళ్లాడు. ములుగులోని ఓ కాలనీలో దివ్యాంగురాలైన ఓ యువతి (18) కుటుంబ సభ్యులతో నివసిస్తోంది.
మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు.. ఆ దివ్యాంగురాలి రక్షణ కోసం బయట నుంచి తాళం వేశారు. ఇది గమనించిన స్థానికుడైన ఓ బాలుడు (17) ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News