₹40 వేల కోట్లకు టోకెన్లు
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:30 AM
ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల యజమానులకు చేయాల్సిన చెల్లింపులు సహా వివిధ క్యాటగిరీల్లో మొత్తం రూ.40 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించేందుకు టోకెన్లు జారీ చేశామని.. అయితే ప్రస్తుతానికి వెంటనే చెల్లించే పరిస్థితి లేదని సర్కారు హైకోర్టుకు తెలిపింది.
కానీ.. ఆ మొత్తం చెల్లించే పరిస్థితి ఇప్పుడు లేదు
హైకోర్టుకు స్వయంగా వెల్లడించిన ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
భూపరిహారంపై ధిక్కరణ కేసుల్లో వర్చువల్‌గా హాజరు
తమ ముందున్న కేసులకు సంబంధించి రూ.51 కోట్లను
12 వారాల్లో చెల్లించాలని ధర్మాసనం ఆదేశం
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల యజమానులకు చేయాల్సిన చెల్లింపులు సహా వివిధ క్యాటగిరీల్లో మొత్తం రూ.40 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించేందుకు టోకెన్లు జారీ చేశామని.. అయితే ప్రస్తుతానికి వెంటనే చెల్లించే పరిస్థితి లేదని సర్కారు హైకోర్టుకు తెలిపింది. వివిధ ప్రాజెక్టుల కోసం చేసిన భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన యజమానులు, రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో హైకోర్టులో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయి. అయితే వాటిపై వివరణ ఇవ్వాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను హైకోర్టు గతంలో ఆదేశించింది. బుధవారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఎదుట సందీప్‌కుమార్ ఆన్‌లైన్‌లో హాజరై వివరణ ఇచ్చారు.
‘ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పరిహారం చెల్లించడమనేది సర్కారు మొదటి ప్రాధాన్యంగా ఉంది. అయితే ప్రస్తుతానికి చెల్లింపులు చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. అది నా అసమర్థత. ఏదేమైనా ఒక్కొక్కటిగా వీలైనంత వేగంగా వారికి చెల్లింపులు చేస్తాం. వీటిని క్లియర్ చేయడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది’ అని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతం తమ ఎదుట ఉన్న కేసుల్లో దాదాపు రూ.51 కోట్లను 12 వారాల్లో చెల్లించేందుకు చివరి అవకాశమిస్తున్నట్లు తెలిపింది. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది.
అలాగే వివిధ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన యజమానులకు చెల్లించాల్సిన పరిహారం ఎంత.. వాటికి ఎంత సమయం పడుతుందనే వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సందీప్‌కుమార్‌ను ఆదేశించింది. ఇటు.. తొలుత సందీ్‌పకుమార్ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి కారణం లేకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎలా కోరతారని మండిపడింది. ‘కోర్టు అంటే అధికారులకు కనీస గౌరవం ఉండట్లేదు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన భూయజమానులకు చెల్లించాల్సిన పరిహారం, సంబంధిత కోర్టు ధిక్కరణ కేసులను మేం తేలికగా తీసుకోబోం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో సందీప్‌కుమార్ వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News