Share News

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:41 AM

తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు.

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Telangana Agriculture University news

  • నిజానిజాలను నిగ్గు తేల్చాలి

  • కుట్రదారులను బయట పెట్టాలి

  • డీజీపీకి వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య లేఖ

  • అల్దాస్‌ జానయ్యను బర్తరఫ్‌ చేయాలి

  • మాజీ మంత్రులు సబిత, సునీత, సత్యవతి డిమాండ్‌

రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు లేఖ రాశారు. ఈ విషయాన్ని వర్సిటీ ప్రజా సంబంధాల అధికారి మీడియాకు వెల్లడించారు. సాధారణ పరిపాలన బదిలీలపై కక్షగట్టి తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బదిలీల ముసుగులో అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు. 11 నెలల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు బురద జల్లే యత్నం వెనుక అసలు కుట్రదారులు ఎవరో సమగ్ర విచారణ ద్వారా తేల్చాలని కోరారు.


సదరు అధ్యాపకురాలికి, తనకు మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్లు, కాల్‌ హిస్టరీలు తదితర డిజిటల్‌ ఆధారాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీని 2047 నాటికి అత్యత్తమంగా తీర్చిదిద్దడం, రైతాంగానికి ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. కాగా, వీసీ అల్దాస్‌ జానయ్యను వెంటనే బర్తరఫ్‌ చేయాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. వీసీ లైంగిక వేధింపులపై బాధిత ప్రొఫెసర్‌ ఉమెన్స్‌ సేఫ్టీ డీజీకి, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని.. వర్సిటీ చాన్స్‌లర్‌ అయిన గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. తనకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ ఆవరణలో.. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు, విద్యార్థులతో కలసి నిరసన తెలుపుతున్న బాధిత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తేజశ్రీని మంగళవారం కలసి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తేజశ్రీ ఫిర్యాదు ఆధారంగా వీసీ జానయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని బాధిత ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలన్నారు.


ఆరోపణల వెనుక కుట్ర: జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

వ్యవసాయ వర్సిటీకి తొలిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య వీసీగా బాధ్యతలు చేపట్టడాన్ని ఓర్వలేక కొందరు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. మంగళవారం బీసీ సంఘాల నాయకులతో కలసి హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అండతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.


జానయ్యపై పోలీసులకు ఫిర్యాదు

తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వీసీ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తేజశ్రీ మంగళవారం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ (ముట్టినట్టు రసీదు) ఇవ్వాలని ఆమె పోలీసులను కోరగా.. బుధవారం ఉదయం ఇస్తామని చెప్పారు. దానికి ఒప్పుకోని తేజశ్రీ పోలీ్‌సస్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. ఆమెకు మద్దతుగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

గ్రూప్‌-1 ఆఫీసర్లుగా ఉపాధి కూలీ పిల్లలు

సినీ నిర్మాతలకు ఐడీ చిక్కులు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:41 AM