Share News

జనగామ మున్సిపల్ మీటింగ్‌లో రచ్చ.. బీఆర్ఎస్ నిరసన

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:49 PM

జనగామలో ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.

జనగామ మున్సిపల్ మీటింగ్‌లో రచ్చ.. బీఆర్ఎస్ నిరసన
Jangaon Municipal Council Meeting

జనగామ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జనగామలో ఈరోజు (గురువారం) జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే వైస్ చైర్మన్‌కు ప్రోటోకాల్ ప్రకారం స్థానం ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు స్వయంగా కుర్చీ తీసుకువచ్చి వైస్ చైర్మన్‌ను కూర్చోబెట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. వివాదం మరింత పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ ఆదేశాల మేరకు వేదికపై కూర్చున్న వైస్ చైర్మన్‌ను పోలీసులు కిందకు దించారు. ఈ చర్యతో బీఆర్ఎస్ నాయకులు మరింత అసహనం వ్యక్తం చేశారు.


చైర్‌పర్సన్ వివరణ..

మున్సిపల్ చైర్‌పర్సన్ కడమంచి బాలమణి ఈ వివాదంపై స్పందించారు. ఈ వేదికపై కూర్చోవడానికి ప్రత్యేక హక్కు లేదా నిబంధన లేమీ లేవని, కమిషనర్ మార్గదర్శకాల ప్రకారమే సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ ఘటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ఈ వివరణతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ నాయకులు వేదిక ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైస్ చైర్మన్‌కు కనీస గౌరవం ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 06:29 PM