Share News

అల్లనేరేడు.. పోషకాలు మెండు..

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:02 AM

ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది.

అల్లనేరేడు.. పోషకాలు మెండు..
Jamun Fruit, health

  • దివ్య ఔషధంగా ఆరోగ్య ఫలప్రదాయిని

  • సీజనల్‌ ఫ్రూట్స్‌కు భలే డిమాండ్‌

  • కిలో రూ.250 నుంచి రూ.300 వరకు

  • నగరంలో జోరుగా విక్రయాలు

హనుమకొండ: ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది. సహజసిద్ధంగా లభించే అల్లనేరేడు పండ్లు తీపి, వగరు, పులుపు రుచులతో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఫలం. వర్షాకాలం ప్రారంభంలో విరివిగా దొరికే అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. నేరేడు పండ్లను తినడం ద్వారా మానవ శరీరంలోని పలు రుగ్మతలైన మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడడం, మలబద్ధకం, గ్యాస్‌స్ట్రబుల్‌, అజీర్తి వంటి సమస్యలనుంచి విముక్తి పొందవచ్చని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే వివిధ రకాల వ్యాధులను నుంచి ఉపశమనం పొందడానికి అల్లనేరేడు పండ్లు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ప్రధానంగా వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం నుంచి ఒక నెల పాటు ప్రజలకు సీజనల్‌ ఫ్రూట్‌గా అందుబాటులో ఉండే అల్లనేరేడు పండ్లకు కాసింత గిరాకీ ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో అల్లనేరేడు పండ్ల ధర రూ.250 నుంచి రూ.300 వరకు పలుకుతుంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటతోపాటు పలు ప్రాం తాల్లో అల్లనేరేడు పండ్ల విక్రయాలను జరుపుతున్నారు.


hnk2.2.jpgదిగుమతి..

అల్లనేరేడు పండ్లు ప్రస్తుతం ఇప్పటికే విరివిగా అందుబాటులోకి రావాల్సి ఉండగా, తక్కువ దిగుబడి కారణంగా హైదరాబాద్‌(భాగ్యనగరం) నగరం నుంచి కొనుగోలు చేస్తూ వరంగల్‌ నగరంలో పలు ఏరియాల్లో అమ్మకాలు జరుపుతున్నామని వ్యాపారస్థులు చెబుతున్నారు. కిందటేడు మే చివరి వారంలోనే అల్లనేరేడు పండ్లు వరంగల్‌ పండ్ల మార్కెట్‌కు పెద్ద ఎత్తున దిగుమతులు జరిగేవి. కానీ ఈ యేడు అల్లనేరేడు పండ్ల దిగుమతి తక్కువ కావడంతో రేటు అధికంగా పలుకుతోంది. దీంతో పండ్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు కొంతమేర ఆసక్తి చూపడం లేదని పలువురు విక్రయదారులు వాపోతున్నారు.


hnk2.3.jpgకిలో రూ.300 వరకు విక్రయిస్తున్నాం..

  • మహ్మద్‌ జిలానీ, హనుమకొండ

అల్లనేరేడు పండ్లకు ఈ యేడు కొంచెం ధర ఎక్కువగా పలుకుతోంది. ఏటా జూన్‌ మొదటి వారంలోనే వరంగల్‌ పండ్ల మర్కెట్‌కు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే అల్లనేరేడు ఈసారి తక్కువ మోతాదులో రావడంతో హైదరాబాద్‌ నుంచి దిగుమతి చేసుకోవడంతో రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నాం. వేసవి ముగిసే సమయానికి విరివిగా నగరానికి దిగుమతి కావాల్సిన అల్లనేరుడు ఈయేడు తక్కువ కావడంతో ధరలు ఎక్కువగా పలుకుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో విక్రయాలు చేయలేక ఉపాధి కోల్పోతున్నాం. రెండు, మూడు వర్షాలు పడిన తరువాత నేరేడు పండ్ల దిగుబడి ఎక్కువగా పెరిగి నగరానికి దిగుమతి అయ్యే అవకాశాలు ఉంటాయని ఆశిస్తున్నా.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి

ఈ-సైకిళ్లకు యమ డిమాండ్‌..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 11:08 AM