జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 12 , 2026 | 09:58 AM
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబ్‌పేట శివారులో కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
జనగామ, జూన్ 12: జిల్లాలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. లింగాలఘణపురం మండలం నవాబ్‌పేట శివారులో కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన కొందరు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, లింగాలఘణపురం మండలం నవాబ్‌పేట గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తానా ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
దుబాయి రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు