అదృష్టమంటే ఈమెదే.. భారీ ఈదురుగాలుల సమయంలో ఏమైందో చూడండి..
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:55 AM
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో భారీ ఈదురుగాలులతో కూడిన తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో ఒక మహిళ రోడ్డుపై వెళ్తోంది. గాలి వేగానికి అకస్మాత్తుగా ఒక ఇంటిపై అమర్చిన రేకు ఎగిరి నేరుగా ఆ మహిళ వైపు దూసుకొచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో కొన్నిసార్లు మనల్ని పూర్తిగా షాక్‌కు గురిచేసే వీడియోలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ 'ఆమె నిజంగా అదృష్టవంతురాలు, ప్రాణాపాయం నుంచి లక్కీగా బయటపడింది' అని కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాతంలో ఇటీవల అకస్మాత్తుగా భారీ ఈదురుగాలు వీచాయి. ఆ సమయంలో ఒక మహిళ రోడ్డుపై వెళ్తోంది. గాలి వేగానికి అకస్మాత్తుగా ఒక ఇంటిపై అమర్చిన రేకు ఎగిరి నేరుగా ఆ మహిళ వైపు దూసుకొచ్చింది. ఆ రేకు ఎంత వేగంగా వచ్చిందంటే, అది దాదాపు ఆమె మెడ భాగం వరకు వచ్చేసింది. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆమె ప్రాణాలు పోయేవి. కానీ ఆ మహిళ అత్యంత చాకచక్యంగా, సమయస్ఫూర్తితో ఆ రేకును చేతులతో పక్కకు నెట్టేసి, వెంటనే అక్కడి నుంచి పక్కకు పరుగులు తీసింది.
ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ 'ఫైనల్ డెస్టినేషన్' సినిమా సీన్‌లా ఉందని, ఆమె చావు కొద్దిలో మిస్ అయ్యిందని కామెంట్ చేశారు. ‘ఆమెకు భూమిపై నూకలు ఇంకా ఉన్నాయి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వేప ఆకులే కాదు.. పండు కూడా ఔషధమే!
మేం రాలేం.. కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాం!