Share News

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Jun 12 , 2026 | 10:00 AM

ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 2210 రూపాయలు పెరిగింది.

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Price Today

ఇంటర్‌నెట్ డెస్క్: గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు పెరిగాయి. నిన్న (గురువారం) 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 2210 రూపాయలు పెరిగింది.


గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,48,580 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,36,200 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,11,440 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు ఇలా..

వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. 100 గ్రాములపై 500 రూపాయలు.. కేజీ వెండిపై 5000 రూపాయలు పెరిగింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 26,500 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,65,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి

కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్... తాడిపత్రిలో ఉద్రిక్తం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి

Updated Date - Jun 12 , 2026 | 10:03 AM