Share News

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:22 AM

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి
Instagram Friendship

  • పోలీసుల అదుపులో యువకుడు

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, పెళ్లికి నిరాకరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతికి అదే జిల్లా రఘునాథపాలెం మండలం కోయదండ గ్రామానికి చెందిన మాధంసెట్టి రాంబాబు గత సంవత్సరం జూలైలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయ్యాడు.


వారి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. వివాహం చేసుకుంటా నంటూ ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు నగరంలోని పలు హోటళ్లకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి అడిగినప్పుడల్లా దాటేయడంతోపాటు ఆమెను బెదిరించాడు. విషయాన్ని గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు. రాంబాబు, అతడి తల్లి విమల బెదిరింపులకు పాల్పడ్డారు.


దీంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, పెళ్లి పేరుతో మోసం చేసిన రాంబాబుపైన, అతడి తల్లి విమలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 09:22 AM