మామిడి తొక్కలతో ఇన్ని ఉపయోగాలా! తెలిస్తే ఆశ్చర్యపోతారు
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:16 AM
మామిడి పండును తిన్న తర్వాత తొక్కలను చెత్తలో పడేయడం చాలా మందికి అలవాటు. అయితే ఈ తొక్కల్లో కూడా విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మామిడి పండును తిన్న తర్వాత చాలా మంది తొక్కలను చెత్తగా భావించి పారేస్తారు. కానీ మామిడి తొక్కల్లో కూడా అనేక పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి చర్మ సంరక్షణ నుంచి తోటపని వరకు అనేక విధాలుగా ఉపయోగపడతాయని అంటున్నారు.
చర్మానికి సహజమైన మెరుపు
మామిడి తొక్కల్లో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తొక్క లోపలి భాగాన్ని ముఖంపై సున్నితంగా రుద్దితే టానింగ్ తగ్గి, మచ్చలు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది. తొక్కలను ఎండబెట్టి పొడిచేసి ఫేస్‌ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.
వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయం
మామిడి తొక్కలు చర్మంపై వచ్చే ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. తొక్క లోపలి భాగాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారి, అకాల వృద్ధాప్య లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది.
పగిలిన మడమలకు ఉపశమనం
పగిలిన మడమల సమస్యతో బాధపడేవారు మామిడి తొక్క లోపలి భాగాన్ని మడమలపై రుద్దవచ్చు. ఇందులో ఉండే తేమ గుణాలు, పోషకాలు మడమలను మృదువుగా మార్చి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మొక్కల పెరుగుదలకు తోడ్పాటు
తోటపని చేసే వారికి మామిడి తొక్కలు మంచి ఎరువులా పనిచేస్తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. తొక్కలను చిన్న ముక్కలుగా చేసి మట్టిలో కలపవచ్చు. లేదా మామిడి తొక్కలను రెండు మూడు రోజులు నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే వాటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సక్సెస్ కోసం సంతకం ఇలా చేయండి!
ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు