సక్సెస్ కోసం సంతకం ఇలా చేయండి!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:11 PM
సంతకం అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదు.. అది వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం, లక్ష్యాలను కూడా ప్రతిబింబిస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సంతకంలో చిన్న చిన్న మార్పులు చేస్తే వ్యక్తిగత ఎదుగుదల, విజయంపై సానుకూల ప్రభావం చూపుతాయని వారు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి రోజుల్లో చాలా మంది సంఖ్యాశాస్త్రం, వాస్తు వంటి అంశాలను వ్యక్తిగత అభివృద్ధికి మార్గదర్శకాలుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఖ్యాశాస్త్ర నిపుణులు సంతకానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సూచనలు చేశారు. సంతకం చేసే విధానం వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం, విజయాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు.
సంతకం పైకి వెళ్లేలా ఉండాలి
సంతకం ప్రారంభం నుంచి చివరి వరకు స్వల్పంగా పైకి ఎగబాకేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పైకి వెళ్లే సంతకం ఎదుగుదల, పురోగతి, ఆశయాలకు ప్రతీకగా భావిస్తారు. కిందికి వాలే సంతకం నిరుత్సాహం లేదా వెనుకబడిన ఆలోచనలకు సంకేతంగా పరిగణిస్తారని నిపుణులు అంటున్నారు.
అక్షరాలు విడివిడిగా ఉండకూడదు
సంతకంలోని అక్షరాలు సాధ్యమైనంత వరకు ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్షరాల మధ్యలో గ్యాప్ ఉండటం స్థిరత్వం లోపాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సంతకం కింద సపోర్ట్ లైన్
సంతకం కింద ఒక గీత గీయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ గీత సంతకం కింద నుంచి పైకి స్వల్పంగా ఎగబాకేలా ఉండాలని సూచిస్తున్నారు. ఇది ఆత్మవిశ్వాసం, బలం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.
సంతకాన్ని పూర్తిగా చేయాలి
సంతకం సాఫీగా, ఒకే ప్రవాహంలో పూర్తవ్వాలి. మధ్యలో ఆపడం లేదా అసంపూర్తిగా ముగించడం కంటే సంతకాన్ని పూర్తిగా చేయడం మంచిదని చెబుతున్నారు. ఇలా ఉండే సంతకం ఏకాగ్రత, స్పష్టమైన ఆలోచనలకు ప్రతీకగా భావిస్తారు.
మొదటి అక్షరానికి ప్రాధాన్యం
సంతకంలో పేరులోని మొదటి అక్షరం స్పష్టంగా, కొంచెం హైలైట్ అయ్యేలా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వ్యక్తిత్వాన్ని బలంగా ప్రతిబింబిస్తుందని చెబుతారు.
సంతకం చివర ఒకే చుక్క పెట్టొద్దు
కొన్ని సంఖ్యాశాస్త్ర నమ్మకాల ప్రకారం, సంతకం చివర ఒకే చుక్క పెట్టడం మంచిది కాదని భావిస్తారు. చుక్కలు పెట్టాలనుకుంటే రెండు చుక్కలు పెట్టడం లేదా అసలు పెట్టకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
నిమ్మకాయ ఎండిపోయిందా? పారేయకండి.. ఇలా వాడండి
ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు