త్వరలోనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం: రైల్వే బోర్డు చైర్మన్
ABN , Publish Date - Jul 05 , 2026 | 09:32 AM
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయని ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ కోచ్ ఫ్యాక్టరిని ప్రారంభిస్తామని తెలిపారు.
హనుమకొండ, జులై 5 (ఆంధ్రజ్యోతి): కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Railway Coach Factory) పనులు పూర్తి అయ్యాయని ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ (Satish Kumar) పేర్కొన్నారు. త్వరలోనే ఈ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. ఉత్పత్తి కోసం టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పుకొచ్చారు. ఈరోజు(ఆదివారం) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను సతీశ్ కుమార్, రైల్వే అధికారులు పరిశీలించారు.

రైల్వే అధికారులతో కోచ్ ఫ్యాక్టరీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చోట మరింత భూమి సేకరించాలని అధికారులకు రైల్వే బోర్డు చైర్మన్ సూచించారు. పెయింటింగ్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే విభిన్న అత్యున్నతమైన కోచ్‌లు తయారవుతాయని వివరించారు. ఉద్యోగాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి
వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News