కాంగ్రెస్ సర్కారు తీరు వల్లే లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:28 AM
కాంగ్రెస్ సర్కారు తీరు వల్లే తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
వారసత్వంగా వచ్చిన భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు
ప్రొక్లెయినర్‌ను సీజ్ చేసి జరిమానాలు విధించారు: హరీశ్
బచ్చన్నపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కారు తీరు వల్లే తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివా్‌సతో కలిసి మంగళవారం హరీశ్‌రావు పరామర్శించారు. అనంతరం హరీశ్ విలేకరులతో మాట్లాడారు.
లక్ష్మణ్‌గౌడ్‌కు చెందిన ప్రొక్లెయినర్‌ను సీజ్ చేసి భారీగా జరిమానాలు విధించటం, భూగర్భ జలాలు అందక పంట ఎండిపోవడం, వారసత్వంగా వచ్చిన భూమిని అధికారులు ప్రొహిబిషన్ జాబితాలో చేర్చడంతో మనస్తాపం చెంది లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. భూమి అమ్ముకునే అవకాశం ఉంటే అప్పులు తీర్చేవాడని పేర్కొన్నారు. ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనను కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్ తరపున లక్ష్మణ్‌గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News