Share News

కాలువలో చిక్కిన డెవిల్‌ ఫిష్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:34 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ఓ కాలువలో మత్స్యకార్మికులకు వింతైన చేప లభించింది.

కాలువలో చిక్కిన డెవిల్‌ ఫిష్‌
Devil Fish, Warangal

జఫర్‌గడ్‌(వరంగల్): ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ఓ కాలువలో మత్స్యకార్మికులకు వింతైన చేప లభించింది. గ్రామ చివర కందకం (కాలువ)లో నీరు చేరడంతో బుధవారం మత్స్యకార్మికులు చేపల కోసం వల వేయగా.. అందులో వింత ఆకారంలో ఉన్న చేప చిక్కింది. సాధారణ చేపలకు భిన్నంగా, శరీరంపై గట్టి కవచం లాంటి పొరలు, వింత ఆకారం, ప్రత్యేకమైన నోరుతో ఉన్న చేప చిక్కింది.


hnk1.2.jpgలేత నీలి రంగులో గల ఈ చేప శరీరంపై ఎముకలతో కూడిన గట్టి పలకలు ఉన్నాయి. ఈ చేపను ’డెవిల్‌ ఫిష్‌‘ అంటారని, ఇవి కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కాలువల్లో విస్తరించినట్లు పలువురు మత్స్యకారులు తెలిపారు. వలలో చిక్కిన వింత ఆకారంలోని ఇలాంటి చేప ఈ ప్రాంతంలోని జలాశయాల్లో ఎప్పుడూ కనిపించకపోవడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 12:34 PM