Share News

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

ABN , Publish Date - Nov 22 , 2026 | 10:50 AM

వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
accident four dead

వికారాబాద్, నవంబరు 22: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని పెండ్లిమడుగు మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో కేరెల్లికి వెళ్తోంది. బుగ్గ రామేశ్వరం సమీపంలోని మలుపు వద్ద ప్రమాదవశాత్తు ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌ నగేశ్‌తో పాటు.. ముగ్గురు మహిళలు.. చంద్రమ్మ, పార్వతమ్మ, సరితలు ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 12:06 PM