Share News

గణేశ్ నిమజ్జనంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:48 AM

వికారాబాద్ జిల్లాలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని పరిగిలో వినాయక నిమజ్జనంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరేగింపులో నర్సింహులు అనే కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

గణేశ్ నిమజ్జనంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
Vikarabad Constable Injured

వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని పరిగిలో వినాయక నిమజ్జనంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరేగింపులో నర్సింహులు అనే కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. రెండు గ్రూపుల మధ్య గొడవ జరుగుతుండగా కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు.


అప్పటికే కత్తితో ఉన్న యువకుడు ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కానిస్టేబుల్‌ను హుటాహుటినా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రక్త స్రావం ఆగకపోవడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. తరుణ్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 07:27 AM