Share News

ఇంకా దొరకని షాబాద్‌ నిందితుడి ఆచూకీ.. గాలిస్తున్న 12 బృందాలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:54 PM

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు.

ఇంకా దొరకని షాబాద్‌ నిందితుడి ఆచూకీ.. గాలిస్తున్న 12 బృందాలు
Shabad Accused Raj Kumar

రంగారెడ్డి జిల్లా, జులై 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ (Shabad Accused Raj Kumar) ఇంకా దొరకలేదు. అతని కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు రాజ్‌కుమార్ జాడ చిక్కలేదు. చేగూరు వద్ద తన కారును వదిలేసి తిమ్మాపూర్ రైల్వేట్రాక్ మీదకు రాజ్‌కుమార్ వెళ్లాడు. ఎదురుగా ఓ రైలు వస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని చూశాడని ధైర్యం చాలక పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.


నిందితుడు రాజ్‌కుమార్ ఎక్కడికెళ్లాడన్నది సస్పెన్స్‌గా మారిందని పోలీసులు చెబుతున్నారు. చేగురు వద్ద అతని కారులో డీజిల్ అయిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పటికే తిమ్మాపూర్ రైల్వేస్టేషన్‌తో పాటు వివిధ రైల్వేస్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. బెంగళూరు హైవేతో పాటు శ్రీశైలం, ఇతర రాష్ట్రాల్లో కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి దగ్గర సుమారుగా డజనుకుపైగా సిమ్ కార్డులు, మూడు ఫోన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అవేమీ రాజ్‌కుమార్ వాడట్లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.


ఈ వార్తలు కూడా చదవండి...

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:12 PM