Share News

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనులపై ఫోకస్

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:00 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబరు 7, 8, 9 తేదీల్లో కొడంగల్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనులపై ఫోకస్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) నవంబరు 7, 8, 9 తేదీల్లో కొడంగల్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.46.08 కోట్లతో నిర్మించిన 10 ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలకు హాజరుకానున్నారు. నవంబరు 7వ తేదీన హకీంపేటలో మెగా రైతుమేళా, ఇండస్ట్రీయల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. రైతుమేళాలో ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు.


పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నవంబరు 8వ తేదీన స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. లగచర్ల ఇండస్ట్రీయల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. రూ.5,060 కోట్లతో కొత్వాల్‌గూడ - నాచారం రేడియల్ రోడ్డు -2కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.1,410 కోట్లతో 223 బీటీ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. కొడంగల్‌లో రూ.123 కోట్లతో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టనున్నారు.


రూ.118.80 కోట్లతో ఏర్పాటు చేసే 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరుకానున్నారు. నవంబరు 9వ తేదీన హకీంపేటలో భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రైతు సభకు 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో తన మూడు రోజుల పర్యటనలో అభివృద్ధి పనులు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 04:49 PM