రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:57 AM
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందనవనం మెట్రోబార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రంగారెడ్డి జిల్లా, జులై 15 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందనవనం మెట్రోబార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ గోదాం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న మరో గోదాంకు, సమీప భవనాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంటల పాటు శ్రమించి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చాయి. ప్లాస్టిక్ సామగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు
పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ వ్యూహరచన.. సోనియా నివాసంలో కీలక భేటీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News