న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:27 PM
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో వరుసగా వస్తున్న ట్విస్టులు కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి..
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న(34)ను దారుణంగా హత్య (Advocate Swapna Case) చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో వరుసగా వస్తున్న ట్విస్టులు.. కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. స్వప్న హత్యని ప్రమాదంలా చిత్రీకరించి చెల్లిని వదిలించుకోవాలనుకున్న సొంత అన్న క్రూరత్వం.. ఈ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును కేవలం ఒక రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల సమగ్ర విచారణలో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా తేలింది. ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన శేఖర్ అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
పక్కా స్కెచ్‌తో హత్య..
స్వప్న ఎక్కడ ఉంది? ఎటు వెళ్తోంది? అనే లైవ్ లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు నిందితుడు రాజుకు చేరవేసే బాధ్యతను శేఖర్ తీసుకున్నాడు. ఇప్పటివరకు స్వప్న అన్న రాజుతో పాటు వీరేశ్, శివ, శేఖర్ అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు రాజు ఒప్పుకొన్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. స్వప్నను చంపడానికి గతంలోనే రెండుసార్లు స్కెచ్ వేశాడు. కారుతో ఢీకొట్టి చంపాలని చూశాడు.
ఏకంగా బుల్డోజర్‌తో తొక్కించి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. అదృష్టవశాత్తూ ఆ రెండు ఘటనల నుంచి స్వప్న తప్పించుకోగలిగింది. వరుస విఫలయత్నాల తర్వాత.. ఈసారి ఎలాగైనా చంపాలని అనుకున్నాడు. ఈ క్రమంలో రాజు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా నమ్మించాలని ప్లాన్ చేశాడు. ఈ దారుణానికి తన స్నేహితులైన వీరేశ్, శివ, శేఖర్ సహాయం తీసుకున్నాడు. ఈ కేసును పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News