రష్యా సైనికుల చెరలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువకులు
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:50 AM
ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు యువకులు అక్కడి సైనికుల చేతిలో చిక్కుకున్ని ఇబ్బందులకు గురవడం కలకలం రేపుతోంది.
నిజామాబాద్, సెప్టెంబర్ 30: ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు యువకులు అక్కడి సైనికుల చేతిలో చిక్కుకున్ని ఇబ్బందులకు గురవడం కలకలం రేపుతోంది. 6 నెలల క్రితం రష్యా వెళ్లిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్, భూక్యా రవీందర్, అశోక్, మెగవత్ ప్రకాశ్ అనే యువకులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలియజేశారు. ఆరు నెలల క్రితం ఓ కంపెనీలో కూలి పని చేసేందుకు యువకులు రష్యాకు వెళ్లారు.
అయితే వారు పనిచేసిన కంపెనీలో ఆరు నెలలకే పని పూర్తికావడంతో.. యువకులకు సదరు ఏజెంట్ మిలటరీ క్యాంప్‌లో గార్డెన్ క్లీనర్‌గా పెట్టాడు. ఆ తరువాత మిలటరీ వాహనంలో సుమారు 12 గంటల పాటు ఆహారం లేకుండా యువకులు ప్రయాణించారు. ఆపై అడవిలో దించిన మిలట్రీ అధికారులు వారికి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణకు నిరాకరించిన యువకులను మిలటరీ అధికారులు చితకబాదారు.
దీంతో తమ పరిస్థితిని వివరిస్తూ కుటుంబసభ్యులకు యువకులు వాయిస్ మెసేజ్‌లు, వీడియో రికార్డులను పంపిస్తున్నారు. తమను రక్షించాలని స్వదేశానికి తీసుకురావాలని వారు వేడుకుంటున్న పరిస్థితి. దీంతో రష్యాలో చిక్కుకున్న మహమ్మద్ అఫ్జల్ ఖాన్, భూక్యా రవీందర్, అశోక్, మెగవత్ ప్రకాశ్‌లను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
డేటింగ్ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!
స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News