యాదగిరికొండకు పోటెత్తిన కార్తీక పూజల భక్తులు
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:37 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కార్తీక పూజల భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం, వారాంతపు సెలవుల కారణంగా రాష్ట్రం నలుమూల నుంచి 83వేలమందికి పైగా భక్తులు తరలివచ్చారు.
83వేల మందికి పైగా భక్తుల రాక
దర్మదర్శనానికి ఎనిమిది గంటలు
యాదాద్రి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కార్తీక పూజల భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం, వారాంతపు సెలవుల కారణంగా రాష్ట్రం నలుమూల నుంచి 83వేలమందికి పైగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి ధర్మ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటలు, బ్రేక్ దర్శనానికి గంట వ్యవధి పట్టింది.
భక్తులు కొండ దిగువన ఉన్న స్వామి వారి లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించి దీపారాధనలు, తులసీ పూజలు చేశారు. వ్రత మండపంలో 1,314 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రత పూజలు ఆచరించాయి. వివిధ కైంకర్యాల ద్వారా ఆదివారం రూ.62,26,890 ఆదాయం సమకూరినట్టుగా కార్యనిర్వహణాధికారి జె.భవానీ శంకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News