Share News

త్వరలోనే తుమ్మిడిహెట్టి పనులు ప్రారంభిస్తాం

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:24 AM

మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

త్వరలోనే తుమ్మిడిహెట్టి పనులు ప్రారంభిస్తాం
Uttam Kumar Reddy

  • మహారాష్ట్రను ఒప్పిస్తాం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

మిర్యాలగూడ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని గుమస్తాకాలనీ వద్ద రూ.33 కోట్లతో నిర్మించిన 560 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను(జ్యోతిరావుపూలే కాలనీ) శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తమ ఐదేళ్ల పాలన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో బంగారు కాలంగా నిలిచిపోతుందన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేయని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని బస్వాపూర్‌, ధర్మారెడ్డికాల్వ, పిలాయిపల్లి, మిర్యాలగూడ నియోజకవర్గంలో తోపుచర్ల, కేశవాపూర్‌, కొండ్రపోలు, దున్నపోతులగండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని చెప్పారు. మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే గ్రావిటీపై నల్లగొండ, నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 05:24 AM