ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - May 28 , 2026 | 11:39 AM
బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇదని వ్యాఖ్యానించారు.
నల్గొండ, మే 28 (ఆంధ్రజ్యోతి): బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇదని వ్యాఖ్యానించారు. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. బక్రీద్ కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదని... ఇది మానవాళికి ఒక గొప్ప జీవన సందేశమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాలకు అతీతంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ యాత్ర చేపట్టారని ప్రస్తావించారు.
అన్నివర్గాలు, అన్నిమతాల ప్రజలు సమానమేనని, అందరు కలిసి మెలిసి ఉండాలనే గొప్ప సందేశంతో ‘భారత్ జోడో’ యాత్ర చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనడానికి ఇది ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నల్గొండలో మతసామరస్యానికి, గంగా - జమునా - తెహజీబ్‌కు నిలువెత్తు సాక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News