మా ఊళ్లో మద్యం వద్దు..
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:30 AM
ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు మద్యం వద్దే వద్దని తీర్మానం చేశామని సర్పంచ్ అనంతపల్లి సుశీల అన్నారు.
బెల్టుషాపులు నడిపిస్తే రూ.50 వేల జరిమానా
నిజాంపేట(సిద్దిపేట): ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు మద్యం వద్దే వద్దని తీర్మానం చేశామని సర్పంచ్ అనంతపల్లి సుశీల అన్నారు. మండల పరిధిలోని నగరం గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలుచేస్తూ తీర్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా బెల్టుషాపులు నిర్వహించినా,
బహిరంగంగా అమ్మినా రూ.50 వేలు, కొనేందుకు వెళ్లిన వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు. అలాగే మద్యంపై సాక్ష్యాలతో గ్రామపంచాయతీ దృష్టికి తీసుకొచ్చిన వారికి రూ.5 వేల పారితోషికం ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రీతి, పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, ఉపసర్పంచ్, గ్రామస్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!
Read Latest Telangana News and National News