Share News

ముదురుతున్న ఎండలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:54 PM

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది.

ముదురుతున్న ఎండలు

  • జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

కోహీర్‌(మెదక్): ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  • హఠాత్తు ఎండలతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలి.

  • డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండటానికి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.


  • బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటన్‌ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం ఉత్తమం.

  • నూనె వస్తువుల కంటే చలువ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • పశువులను, మూగజీవాలను ఎండలో ఉంచకుండా నీడ పట్టున ఉంచి, తగినంత నీటిని అందుబాటులో ఉంచాలి.


srd3.jpgఉష్ణోగ్రత వివరాలు

సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 35 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంగారెడ్డి జిల్లాల్లో... జిన్నారం 36 నాగల్‌గిద్ద 35.9, కిష్టారెడ్డిపేట్‌ 35.9, గుండ్ల మాచనూర్‌ 35.8, పాశమైలారం 35.8, కోహీర్‌ 35.8, దిగ్వాల్‌ 35.7 కల్హేర్‌ 35.6 పల్వట్ల 35.6, కద్పాల్‌ 35.6, వట్‌పల్లి 35.5 కంకోల్‌ 35.5, పుల్కల్‌ 35.4, రైకోడ్‌ 35.3, హత్నూర 35.3, లక్ష్మీసాగర్‌ 35.1, మనూర్‌ 35.1, నిజాంపేట్‌ 35.1, ఝరాసంగం 35, చౌటకూర్‌ 35, నల్లవల్లి 35, న్యాల్కల్‌ 35, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


సిద్దిపేట జిల్లాలో.. రాఘవాపూర్‌ 35.9, లకుడారం 35.9, సిద్దిపేట 35.9, కోహెడ 35.8, పెద్దకోడూర్‌ 35.5, పోతరెడ్డిపేట 35.5, బెజ్జంకి 35.5, కొడకండ్ల 35.5, చాట్లపల్లి 35.4. హుస్నాబాద్‌ 35.3, అంగడి కిష్టాపూర్‌ 35.1, బేగంపేట, తిప్పారం, ధూల్మిట్ట, రాంపూర్‌, శనిగరం, హబ్షీపూర్‌, రేబర్తి, నంగునూరులో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మెదక్‌ జిల్లాలో... దామరంచ 36.2, యెల్దుర్తి 35.9, కులచారం 35.9, నర్సాపూర్‌ 35.8, పాతూర్‌ 35.7, మనోహరాబాద్‌ 35.6 కౌడిపల్లి 35.6, రామాయంపేట్‌ 35.6, లక్ష్మాపూర్‌ 35.5, వాడి 35.5, చిప్పల్తుర్తి 35.3, చేగుంట 35.3, నాగపూర్‌ 35.3, చిన్నశంకరంపేట్‌ 35.3, మెదక్‌ 35.2, నార్లాపూర్‌ 35.2, రేగోడ్‌ 35.1, కాగజ్‌మద్దూర్‌ 35, చిత్కుల్‌ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 12:54 PM