సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. వాహనాల దగ్ధం
ABN , Publish Date - May 12 , 2026 | 05:20 PM
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాన్‌చెరులోని శ్రీరామ్ ఆటో ఫైనాన్స్‌కు చెందిన వాహనాల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మూడు టిప్పర్లు, డీసీఎం, రెండు ఆటోలు దగ్ధమయ్యాయి.
సంగారెడ్డి జిల్లా, మే 12 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాన్‌చెరులోని శ్రీరామ్ ఆటో ఫైనాన్స్‌కు చెందిన వాహనాల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మూడు టిప్పర్లు, డీసీఎం, రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహనాల గోడౌన్‌లో మంటలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోడౌన్‌లో నిల్వ ఉంచిన వాహనాల మధ్య నుంచి మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో గోడౌన్ మొత్తం దగ్ధమైంది. అక్కడ పార్క్ చేసిన పలు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం.
ప్రమాద కారణాలపై ఆరా..
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News