Share News

ప్రచార హోరు.. దావత్‌ల జోరు..

ABN , Publish Date - Feb 05 , 2026 | 09:34 AM

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తింది. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థలు జాబితా వెల్లడైంది. ఈ ప్రక్రియ పూర్తవగా ఆక ప్రచారాల హోరు జోరందుకుంది. అలాగే ‘విందు’ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

ప్రచార హోరు.. దావత్‌ల జోరు..

  • వార్డుల్లో జోష్‌

  • ఎన్నికల వేళ మందు, విందుతో ఓటర్లకు గాలం

  • పోటాపోటీగా అభ్యర్థుల ఖర్చు

  • అభివృద్ధికంటే తాయిలాలకే పెద్దపీట

  • కళకళలాడుతున్న వార్డులు

  • ప్రజా సమస్యలు పక్కకు..!

మెదక్‌: మున్సిపల్‌ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ చిత్రం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. హామీలకే పరిమితం కాకండా నేరుగా ఓట్లను ఆకర్షించే వ్యూహాల వైపు ప్రచారం మళ్లింది. పట్టణాల్లోని కాలనీలలో వార్డుల వారీగా స్లమ్‌ ఏరియాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నారు. బియ్యం, నూనె, పప్పులు, చక్కెర వంటి సరుకులతో పాటు కొన్ని చోట్ల ప్రత్యేక ప్యాకెట్లుగా ఓటర్ల ఇళ్లకు చేరుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. బహిరంగంగా కాకండా రహస్యంగా పంపిణీ జరగడం గమనార్హం. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థులు ఖర్చులకు వెనకాడడం లేదు. మహిళలు, పేదలు, యువ ఓటర్లే టార్గెట్‌గా వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు దారితీస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.


ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..

ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా దావత్‌లు, నిత్యావసర సరుకుల పంపిణీ జోరుగా సాగుతోంది. పట్టణాలు, కాలనీల్లో సాయంత్రం వేళల్లో డాబాలపై మందు బాటిళ్లతో కిట్టీ పార్టీలు ప్రారంభమయ్యాయి. వార్డుల వారీగా ప్రచారాలు ఊపందుకున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు చికెన్‌, మటన్‌, మందుతో దావత్‌లు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యర్థుల కంటే ముందుండాలన్న తపనతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో జన సమూహాల్లో విందులు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి, ఓటు మనదే.. అభ్యర్థి మనవాడే అన్న భావనను కల్పించేందుకు ఈ దావత్‌లు ఉపయోగపడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.


aaa.jpgయువత, మహిళలే లక్ష్యం

ఎన్నికల అభ్యర్థులు యువత, మహిళలే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి హామీల కంటే దావత్‌లు, పంపిణీలే ప్రచారానికి ప్రధాన ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థులతో పోటీపడి ఖర్చుకు వెనకాడకండా అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ప్రజాప్రతినిధుల చట్టం-1951 (ఆర్‌ఈపీ యాక్ట్‌) సెక్షన్‌ 123 ప్రకారం ఓటర్లకు డబ్బు బహుమతులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం నేరం. విందులు, దావత్‌లు, బహిరంగంగా లేదా రహస్యంగా పంపిణీలు చేయడం నిషేధం. భారతీయ న్యాయసంహిత కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అక్రమ ప్రలోభాలకు పాల్పడినట్లయితే క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం. కొన్ని సమయాల్లో తీవ్ర ఉల్లంఘనలపై నామినేషన్‌ రద్దు చేయవచ్చు. అంతేనా నేర తీవ్రత ఆధారంగా జైలు శిక్షకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్‌ పూర్తి నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2026 | 09:36 AM