సోనియా, రాహుల్‌ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కి ఉందా?: జగ్గారెడ్డి
ABN , Publish Date - Jul 19 , 2026 | 09:09 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.
సంగారెడ్డి, జులై 19: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. వారిని విమర్శించేంత నిజాయితీ నీలో ఉందా? అంటూ కేటీఆర్‌ను జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆదివారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నాడు సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్ కుటుంబం.. నేడు డెత్ డిక్లరేషన్ అనటం సబబా అని నిలదీశారు. కేటీఆర్ కుటుంబానికి నిజాయితీ లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం నాశనాన్ని కోరుకుంటావా? అంటూ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.
సోనియాగాంధీ దయాదాక్షిణ్యాలతో మీ కుటుంబం రాజభోగాలు అనుభవించిందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయారా? అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ సర్కారు సక్సెస్ అయిందని అన్నారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు.
ఉద్యోగాల భర్తీపై చర్చించే దమ్ము లేక నిరుద్యోగులను కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాట ఇచ్చి నిలుపుకునే కుటుబం సోనియా గాంధీ కుటుంబానిదని.. మాట ఇచ్చి మోసం చేసే కుటుంబం కేసీఆర్‌ది అని జగ్గారెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీతోపాటు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని జగ్గారెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌నినో ఎఫెక్ట్.. 10 జిల్లాలకు స్పెషల్ ఐఏఎస్‌లు
రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు
For More TG News And Telugu News