రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:34 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద మోటార్లు ఆన్ చేసి.. రైతన్నకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. గోదావరి జలాలు వచ్చినవి వచ్చినట్లు కిందకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.
సిద్ధిపేట, జులై 19: కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద మోటార్లు ఆన్ చేసి.. రైతన్నకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. గోదావరి జలాలు వచ్చినవి వచ్చినట్లు కిందకి వదులుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి చుక్కని పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒడిసి పడుతుందని గుర్తు చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వమంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు.
కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావని.. మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని నేతలకు హరీశ్ రావు చురకలంటించారు. రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకోవద్దంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. నీళ్లు లేకుంటే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర పరిణామాలకు నీదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారంటూ సీఎం రేవంత్‌పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
భద్రాచలం కొట్టుకుపోతుందంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని అన్నారు. నీళ్లు ఇవ్వడం ఇష్టం లేక ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు. వేషాలకు పోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అన్ని రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 60 శాతం తెలంగాణకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. రైతులకు నీళ్లు ఇచ్చే దాక ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..
For More TG News And Telugu News