Share News

సోనమ్ వాంగ్‌‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:44 PM

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులె‌టిన్‌ను ఆదివారం వైద్యులు విడుదల చేశారు.

సోనమ్ వాంగ్‌‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
Sonam Wangchuk

న్యూఢిల్లీ, జులై 19: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం హెల్త్ బులె‌టిన్‌ను వైద్యులు విడుదల చేశారు. గత 20 రోజులుగా ఆయన ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలిపారు. సుదీర్ఘ ఉపవాసం కారణంగా ఆయన తీవ్ర నిరసంతో ఉన్నారని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చే సమయంలో ఆయన పూర్తి స్పృహలో ఉన్నారని వివరించారు. ఆయన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు.


సోనమ్ వాంగ్‌‌చుక్‌కు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారని అన్నారు. అయితే సోనమ్ వాంగ్ చుక్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఆయన్ని అక్రమంగా నిర్బంధించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.


నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతోపాటు విద్యా వ్యవస్థలోని లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. శనివారం (18-07-2026) ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. సోనమ్ వాంగ్‌చుక్‌కు తగిన వైద్య సహాయం అందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దాంతో సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..

For More National News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 03:18 PM