ఎల్‌నినో ఎఫెక్ట్.. 10 జిల్లాలకు స్పెషల్ ఐఏఎస్‌లు
ABN , Publish Date - Jul 19 , 2026 | 07:36 PM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షా భావ పరిస్థితులతోపాటు సీజనల్ పరిస్థితుల పర్యవేక్షణకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్, జులై 19: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షా భావ పరిస్థితులతోపాటు సీజనల్ పరిస్థితుల పర్యవేక్షణకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా వర్షపాతం, తాగునీటి లభ్యత, భూగర్బ జలాలు, వ్యవసాయ పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై ఈ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. జులై 20న వీరంతా జిల్లాల పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం జారీ చేసిన ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక అధికారులు.. మంత్రులు, కలెక్టర్లతోపాటు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు. త్వరలో వీరితో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
పాత 10 జిల్లాలకు ఒక్కో స్పెషల్ ఆఫీసర్ నియామకం..
హైదరాబాద్ జిల్లా: జయేష్ రంజన్
రంగారెడ్డి జిల్లా: వికాస్ రాజ్
కరీంనగర్ జిల్లా: బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా
మెదక్ జిల్లా: ఎ.వాణి ప్రసాద్
నిజామాబాద్ జిల్లా: యోగితా రాణా
నల్గొండ జిల్లా: హరిచందన దాసరి
ఆదిలాబాద్ జిల్లా: ఇలంబరితి కె
వరంగల్ జిల్లా: ఎ. శ్రీదేవసేన
మహబూబ్‌నగర్ జిల్లా: వి.పి.గౌతమ్
ఖమ్మం జిల్లా అనుదీప్ దురిశెట్టి
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్
రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు
For More TG News And Telugu News