Share News

ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:18 PM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి. సీతక్క అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లకు ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్
TG Minister Seethakka

హైదరాబాద్, జులై 19: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి. సీతక్క అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లకు ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జల సిరి కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదివారం ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది12 కోట్ల పనిదినాలే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మొదటి దశలో 4.5 కోట్ల పని దినాలు అని.. రోజుకు 5 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యమని పేర్కొన్నారు.


నీటి సంరక్షణ పనులకు భారీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 9.60 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. 25 వేల పంట కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5 వేల ఊట కుంటలు నిర్మాణం చేపడతామన్నారు. 5 వేల బోర్‌వెల్ రీఛార్జ్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో జలసిరి కార్యక్రమం వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క వివరించారు.


మరో వైపు ఈ ఏడాది ఎల్‌‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని సాగునీటిని యథేచ్చగా విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పంటల సాగు చేసే రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపడుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రేమ పేరుతో మోసం.. గర్భవతిని చేసి ముఖం చాటేసిన అధికారి

రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు

For More TG News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 06:35 PM