Share News

ప్రేమ పేరుతో మోసం.. గర్భవతిని చేసి ముఖం చాటేసిన అధికారి

ABN , Publish Date - Jul 19 , 2026 | 04:54 PM

ఓ యువతిని ప్రేమ పేరుతో మాయమాటలతో మోసం చేసి, గర్భవతి అని తెలిసిన వెంటనే ముఖం చాటేశాడో అధికారి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ పేరుతో మోసం.. గర్భవతిని చేసి ముఖం చాటేసిన అధికారి
Sangareddy News

సంగారెడ్డి, జులై 19: ఓ యువతిని ప్రేమ పేరుతో మాయమాటలతో మోసం చేసి, గర్భవతి అని తెలిసిన వెంటనే ముఖం చాటేశాడో అధికారి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్‌ఎం (ANM) అప్రెంటిషిప్ శిక్షణ పొందుతున్న యువతితో నర్సింగ్ అధికారి సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో ప్రేమ వ్యవహారం కొనసాగించిన అధికారి.. ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకుని యువతిని గర్భవతిని చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


గర్భం దాల్చిన అనంతరం పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించగా సదరు అధికారి ముఖం చాటేశాడు. దీంతో ఆమె నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు

సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 06:13 PM