Share News

డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరింపు.. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్

ABN , Publish Date - Nov 06 , 2026 | 03:05 PM

సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి NH- 65పై వాహనాలు ఆపిన వారిని టార్గెట్ చేస్తూ ఈ ముఠా చోరీలకు పాల్పడిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు.

డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరింపు.. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
Interstate Robbery Gang

సంగారెడ్డి జిల్లా, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిన్న (గురువారం) అర్ధరాత్రి NH- 65పై వాహనాలు ఆపిన వారిని టార్గెట్ చేస్తూ ఈ ముఠా చోరీలకు పాల్పడిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. పూణేలో చోరీ చేసిన బైకుతో నిందితులు దొంగతనాలు చేస్తున్నారు. అక్టోబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైవేపై నాలుగు చోట్ల చోరీలను ఈ గ్యాంగ్ చేసింది.


సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కోహిర్, చిరాగ్‌పల్లిలో ఆగి ఉన్న వాహనాల్లోని వారిని డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరించి నగలు, డబ్బులను కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద కూడా నిందితులు దారి దోపిడీ చేశారు. మడ్గి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో కేటుగాళ్లు పట్టుబడ్డారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పరారీలో ఉన్నాడని ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 03:50 PM