సాహిత్యంతో నందిని సిధారెడ్డి సమాజంలో చైతన్యం తెచ్చారు: హరీశ్‌రావు
ABN , Publish Date - Apr 18 , 2026 | 09:48 PM
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి గొప్ప పాత్ర పోషించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిధారెడ్డికి అవార్డు రావడం అంటే అవార్డుకే విలువ పెరిగిందని పేర్కొన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి గొప్ప పాత్ర పోషించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) వ్యాఖ్యానించారు. సిధారెడ్డికి అవార్డు రావడం అంటే అవార్డుకే విలువ పెరిగిందని పేర్కొన్నారు. ఈ అవార్డు సిద్దిపేట గడ్డకు వచ్చిన గౌరవమని ఉద్ఘాటించారు. విపంచి కళానిలయంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ నందిని సిధారెడ్డికి ఈరోజు(శనివారం) పౌర సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
నందిని సిధారెడ్డి గొప్ప వక్త, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతల మీద తన రచనల ద్వారా చైతన్యం తీసుకువచ్చారని ప్రశంసించారు. తెలంగాణ మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి నందిని సిధారెడ్డి అని చెప్పుకొచ్చారు. కోటి రూపాయలు కూడా వదులుకున్న గొప్ప వ్యక్తిత్వం సిధారెడ్డిదని తెలిపారు. సాహిత్యం కోసం ఎంతగానో ఆయన కృషి చేశారని వెల్లడించారు. ఒక్కప్పుడు ఆంధ్రా వారు మాత్రమే తెలుగు సభలు నిర్వహించేవారని.. తెలంగాణ తెలుగు సభలు కూడా నందిని సిధారెడ్డి గొప్పగా నిర్వహిచారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News