రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:31 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంబరాలు దేని కోసం.. అధికారంలోకి రావడానికి చేసిన హామీలన్నీ విస్మరించినందుకా అని ప్రశ్నించారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 5: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు(శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంబరాలు దేని కోసం.. అధికారంలోకి రావడానికి చేసిన హామీలన్నీ విస్మరించినందుకా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నటుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పని తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, జీఓ నం 97 రద్దు, రైతులకు న్యాయమైన కరెంట్ కోసం, ప్రజా సమస్యలు ఎజెండాగా అసెంబ్లీలో బీఆర్ఎస్ కొట్లాడుతోందని తెలిపారు.
కుంభకోణాల మయంగా మారిన ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ మాజీ మంత్రి విమర్శించారు. రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే.. కేసీఆర్ రాజీనామా చేయాలంటున్నారని మండిపడ్డారు. రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి అని అన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్‌ఎల్పీలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని హరీశ్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
సురేఖను కాపాడేందుకు చాలా ప్రయత్నించాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కేసీఆర్‌లానే రేవంత్ కూడా భూములమ్మే ప్రయత్నం: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News