ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 08:33 AM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
సంగారెడ్డి జిల్లా, మే 5 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల చర్యలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతి చెందారు. వీరిని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తుల్జాపూర్ భవానీ మాతను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం వెంటనే జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్
బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం
వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News