Share News

గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు..

ABN , Publish Date - Apr 03 , 2026 | 03:59 PM

గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు.

గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Harish Rao

నారాయణపేట జిల్లా: గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బావోజీ జాతర(లోక్ మసంద్ మహారాజ్ జాతర)కు మాజీ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'లోక్ మసంద్ మహారాజ్ జాతరకు రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి రూ.8 కోట్లతో బ్రిడ్జి వేయించింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఈ దేవాలయ అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేశారు. మా తండాలో మా రాజ్యం అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. అన్ని రంగాల్లో కేసీఆర్ వారికి రిజర్వేషన్లు తెచ్చారు. గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్ ఇచ్చి వారు చేసిందేమీ లేదు. రూ.2,730 కోట్లు ఎస్టీలకు బడ్జెట్‌లో పెట్టి కేవలం రూ.50 కోట్లే ఖర్చు చేశారు.


గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహాకాలు ఇస్తామన్నారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యకు దూరం చేస్తున్నారు. మా లంబాడీలను దగా చేశారు. సీఎం రేవంత్, ఆయన మనుమడు ఫుట్ బాల్ ఆడేందుకు డబ్బులు ఉంటాయి కానీ ఎస్టీలకు ఇచ్చేందుకు లేవా?. లగచర్లలో లంబాడీల భూములు గుంజుకుని సీఎం రేవంత్ రెడ్డి వారిని జైలులో పెట్టారు. ఇక్కడ చేసింది చాలదని కేరళకు పోయి గొప్పలు చెబుతున్నారు. ఇంట్లో ఈగల మోత అంటే కేరళపోయి పల్లకీల మోత అన్నట్లు ఉంది. కొడంగల్‌ నియోజకవర్గంలో ఏ గ్రామంలో రుణమాఫీ వంద శాతం జరిగిందో రేవంత్ చూపించాలి.


నేను కొడంగల్ వచ్చినా గ్రామసభల్లో మీ నాయకులను జనం నిలదీస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్యాకేజ్-3లో కొంత పని మాత్రమే మిగిలి ఉంది. త్వరగా ఆ పని పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని చేయల్లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల పాలమూరు ప్రజలకు అన్యాయం జరిగింది' అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మేడారంలో ఘోర ప్రమాదం.. రాతి కట్టడం పడి బాలుడి కాలు తొలగింపు

పంజాబ్‌తో మ్యాచ్ వేళ.. చెన్నై ప్లేయర్ సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Apr 03 , 2026 | 04:26 PM