రాజధాని అమరావతికి.. త్వరలో పిన్‌కోడ్
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:35 PM
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఈ బిల్లు.. ఒకటి రెండు రోజుల్లో గెజిట్‌గా మారనుంది.
అమరావతి, ఏప్రిల్ 03: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఈ బిల్లు.. ఒకటి రెండు రోజుల్లో గెజిట్‌గా మారనుంది. ఈ క్రమంలో అమరావతి నూతన రాజధానికి త్వరలోనే సరికొత్త పిన్ కోడ్ (PIN CODE)ను తపాలా శాఖ విడుదల చేయనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిగా భారత తపాలా శాఖ ద్వారా అధికారికంగా గుర్తింపు లభించనుంది.
అడ్వకేట్, సామాజిక కార్యకర్త వి. రమేశ్ చంద్ర వర్మ దాఖలు చేసిన ఫిర్యాదుపై తపాలా శాఖ శుక్రవారం స్పందించింది. అలాగే రాజధాని ప్రాంతంలో జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) నిర్మాణానికి ఇప్పటికే భూమిని సేకరించినట్లు వెల్లడించింది. ఈ జీపీఓ నిర్మాణం పూర్తయిన వెంటనే సర్కిల్ కార్యాలయ అనుమతితో కొత్త పిన్ కోడ్‌ను కేటాయించనున్నట్లు తెలిపింది.
ఆధార్, పాస్‌పోర్ట్ సేవలతో పాటూ ప్రత్యేక పిన్ కోడ్ కోసం అడ్వకేట్ రమేష్ చంద్ర వర్మ ఇచ్చిన సూచనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. అంతవరకు ప్రస్తుతం ఉన్న సబ్-ఆఫీసుల ద్వారా ఈ సేవలు కొనసాగుతాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు - 2026 నేపథ్యంలో రైతుల సంక్షేమం, పాలనా సౌలభ్యం కోసం సాగించిన ఈ పోరాటంలో ఇది కీలక అడుగు అని అడ్వకేట్ రమేశ్ చంద్ర వర్మ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదా? వైసీపీ ఎంపీలపై విజయసాయి ఫైర్
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన
For More AP News And Telugu News