Share News

మీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదా? వైసీపీ ఎంపీలపై విజయసాయి ఫైర్

ABN , Publish Date - Apr 03 , 2026 | 03:11 PM

రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ.. స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదా? వైసీపీ ఎంపీలపై విజయసాయి ఫైర్

అమరావతి, ఏప్రిల్ 03: రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ.. స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే.. వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.


వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే.. మీకు చీమకుట్టినట్లు అయినా అనిపించ లేదా అంటూ వైసీపీ ఎంపీలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు మౌన ప్రేక్షకులయ్యారా? అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఖండించరా? అని వైసీపీ ఎంపీలకు విజయసాయిరెడ్డి చురకలంటించారు.


రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో.. గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో అమరావతి విషయంలో వైఎస్ జగన్‌ వ్యవహరించిన తీరుపై పలువురు ఎంపీలు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను రాజ్యసభలోని వైసీపీ సభ్యులు ఎందుకు ఖండించ లేదంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పై విధంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత

గ్రూప్‌-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన

For More TG News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 03:25 PM