Share News

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సింపుల్ యోగాసనాలు చేయడం బెస్ట్

ABN , Publish Date - Apr 03 , 2026 | 03:40 PM

నేటి బిజీ జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి, సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సింపుల్ యోగాసనాలు చేయడం బెస్ట్
Yoga for Blood Circulation

ఇంటర్నెట్ డెస్క్: శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయాలంటే రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలి. అయితే నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది శారీరక కదలికలు తగ్గించడంతో రక్త ప్రసరణ మందగిస్తుంది. దీని వల్ల గుండె సమస్యలు సహా అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ కొన్ని యోగాసనాలను ప్రతిరోజూ చేస్తే రక్త ప్రసరణను మెరుగుపరచవచ్చు.


సర్వాంగాసనం

సర్వాంగాసనం (భుజాల మీద నిలబడే ఆసనం) అనేది మొత్తం శరీరానికి ప్రయోజనం చేకూర్చే ఒక శక్తివంతమైన విలోమ యోగాసనం. ఇది థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచడం, రక్త ప్రసరణను, జీర్ణక్రియను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

1 (2).jpg


ఉష్ట్రాసనం

ఈ ఆసనం రక్త ప్రసరణను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మోకాళ్లపై కూర్చుని వెనక్కి వాలి చేతులతో చీలమండలను పట్టుకోవాలి. ఛాతిని పైకి ఎత్తి 10–20 సెకన్లు ఉండాలి. తర్వాత మెల్లగా కూర్చోవాలి.

2 (1).jpg


అధో ముఖ శ్వానాసనం

ఈ ఆసనం తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అలసట తగ్గించి వెన్నెముకను బలపరుస్తుంది. మోకాళ్లపై నిలబడి, చేతులు నేలపై ఉంచి తుంటిని పైకి ఎత్తాలి. శరీరం ‘V’ ఆకారంలో ఉండాలి.

3 (1).jpg


త్రికోణాసనం

ఈ ఆసనం శరీరానికి సమతుల్యత ఇస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శరీర భంగిమ కూడా సరిగా ఉంటుంది. పాదాలను దూరంగా ఉంచి నిలబడి, ఒక వైపు వంగి ఒక చేతిని కాలి వద్ద ఉంచి, మరో చేతిని పైకి ఎత్తాలి.

Yoga (3).jpg


విపరీత కరణి

ఇది చాలా సులభమైన ఆసనం. కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తి పడుకోవాలి. రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమికి కూడా ఉపయోగపడుతుంది.

4.jpg

జాగ్రత్తలు

  • అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.

  • గర్భిణీలు ఈ ఆసనాలు చేయకూడదు.

  • మెడ లేదా కంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకోవాలి.

  • ఈ యోగాసనాలను క్రమం తప్పకుండా చేస్తే రక్త ప్రసరణ మెరుగై శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 03 , 2026 | 03:40 PM