ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్నారా? అర్హటిక్ యోగాతో చెక్ పెట్టండిలా..
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:01 PM
మానసిక సమస్యలతో నరకం చూస్తున్న వారికి యోగా ఓ వరమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అర్హటిక్ యోగా టెక్నిక్ ద్వారా నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రస్తుత సమాజంలో మనిషి మానసిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఆందోళన, ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు లేకపోలేదు. మానసిక సమస్యలతో నరకం చూస్తున్న వారికి యోగా ఓ వరమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అర్హటిక్ యోగా టెక్నిక్ ద్వారా నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది.
అర్హటిక్ యోగా అంటే ఏమిటి?
వరల్డ్ ప్రాణిక్ హీలింగ్, ఇండియా డైరెక్టర్ శ్రీరామ్ రాజగోపాల్ అర్హటిక్ యోగా గురించి మాట్లాడుతూ.. ‘అర్హటిక్ యోగాను గ్రాండ్ మాస్టర్ చోవా కోక్ సుయ్ అభివృద్ధి చేశారు. మెంటల్ క్లారిటీ పెంచడం, ఆందోళనను తగ్గించటం, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చటం కోసం అర్హటిక్ యోగాను ఆయన అభివృద్ధి చేశారు’ అని తెలిపారు.
అర్హటిక్ యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం..
అర్హటిక్ యోగాలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు.. అర్హటిక్ కుండలిని, అర్హటిక్ ధ్యానం వంటి మెడిటేషన్ టెక్నిక్స్.. ఎనర్జీ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి. అర్హటిక్ మోగాను రోజూ చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎమోషన్స్, ఆలోచనలపై కంట్రోల్ వస్తుంది. మైండ్ ఫోకస్ పెరుగుతుంది.
బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి?
ఒకసారి మెల్లగా ఊపిరి తీసుకోవాలి. రెండు సార్లు ఊపిరి బయటకు వదలాలి. ఇలా చేయటం వల్ల వేగస్ నరాలు యాక్టివేట్ అవుతాయి. హార్ట్ రేటు తగ్గుతుంది. క్లారిటీ, ఫోకస్ పెరుగుతాయి. ఈ బ్రీతింగ్ టెక్నిక్‌ను ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?
నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..