Share News

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:40 PM

‘నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానని’ బీజేపీ నుంచి సస్పెన్షన్‌ వేటుపడిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వ్యాఖ్యానించారు.

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

  • మైనార్టీ జాబితా నుంచి తొలగిస్తా

  • బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే యత్నాళ్‌

బెంగళూరు: ‘నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానని’ బీజేపీ నుంచి సస్పెన్షన్‌ వేటుపడిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వ్యాఖ్యానించారు. విజయపురలో గురువారం హనుమ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలను తొలగించిన మైనార్టీ స్థానంలో మరాఠీలు, బ్రాహ్మణులు, క్షత్రియలను చేరుస్తానన్నారు. ఎట్టి పరిస్థితిలోను బీజేపీలోకి మళ్ళీ చేరుతానని కోరేది లేదన్నారు.


zzzzzzzzz.jpgరాష్ట్రంలోని తండ్రీ కొడుకులు యడియూరప్ప, విజయేంద్రలను పార్టీ నుంచి దూరం చేసి మళ్ళీ తనను ఆహ్వానిస్తారన్నారు. ఆతర్వాత సీఎం అవుతానని అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తరహాలోనే పాలన తీసుకువస్తానన్నారు. బాగల్‌కోటె బీజేపీ అభ్యర్థి వీరణ్ణ చిరంతిమఠ తనకు ఎంతోకాలంగా ఆత్మీయులని, అందుకే ఆయన తరపున ప్రచారం చేస్తానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2026 | 01:40 PM