పంజాబ్‌తో మ్యాచ్ వేళ.. చెన్నై ప్లేయర్ సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:44 PM
కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), పటిష్ఠమైన పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన సీఎస్కే.. ఈసారి తన హోం గ్రౌండ్ చెపాక్‌లో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో భారత వరల్డ్ కప్ 2026 హీరో, చెన్నై ఆటగాడు సంజు శాంసన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు వర్షం కురిపించారు. సంజు శాంసన్ లాగా బీజేపీ నేతలు పని చేయాలని అన్నారు.
ఇవాళ(శుక్రవారం) కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పేరును ప్రస్తావించారు. టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్‌లో సంజు శాంసన్ చెలరేగి ఆడాడని గుర్తు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయని తెలిపారు. జట్టుకు అతని అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు, అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడని, ఇదే ఒక నిజమైన ఆటగాడి గుర్తింపు అని అన్నారు. ప్రతి క్రీడాకారుడికి ఈ లక్షణాలు ఉండాలని.. అప్పుడే విజయం మన ముంగిటకు వస్తుందని ఆయన తెలిపారు.
భారత జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడని, టీ20 ప్రపంచ కప్2026 సమయంలో సంజు కూడా అలాగే వ్యవహరించడానికి వెల్లడించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ రోజున కూడా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటిని చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. మీ అంకితభావం అత్యంత ముఖ్యమని, విజయం కోసం కష్టపడి పని చేయాలని కోరారు. సంజు తరహాలోనే పనిచేసి, పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో సంజుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..
చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?