Share News

పాతరోజులు తెస్తానన్న రేవంత్‌.. నిజంగా అదే పనిచేశారు: కేటీఆర్

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:22 PM

‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు గోస తప్పదని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు అదే వాస్తవమైంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

పాతరోజులు తెస్తానన్న రేవంత్‌.. నిజంగా అదే పనిచేశారు: కేటీఆర్
ktr comments on congress rule

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు గోస తప్పదని కేసీఆర్ ముందుగానే చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాతరోజులు తెస్తానని ఎన్నికల్లో చెప్పిన రేవంత్.. నిజంగా అదే పనిచేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి వెనుకకే పోయిందని విమర్శించారు.


బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటలు కరెంట్ అందుబాటులో ఉండేదని.. కాంగ్రెస్ రాగానే కరెంట్ కోతలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ బయటికి రావాలని.. అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తోన్న కాంగ్రెస్‌కు కేటీఆర్ సమాధానమిచ్చారు. కేసీఆర్ బయటికి రావాల్సిన పనిలేదని.. ఆయన ప్రజల గుండెల్లోనే ఉన్నారని కేటీఆర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పక్కాప్లాన్‌తో ప్రశాంతంగా గణపతుల నిమజ్జన ప్రక్రియ: సీపీ సజ్జనార్

రేషన్‌ ఈకేవైసీకి అక్టోబరు నెలాఖరు వరకు గడువు.. మొబైల్‌తోనే పూర్తి చేసే అవకాశం

Updated Date - Sep 26 , 2026 | 06:50 PM