ఖమ్మం జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:22 PM
ఖమ్మం జిల్లాలో ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి రంజాన్ బీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొణిజర్ల మండలం లాలాపురంలో ఈ ఘటన జరిగింది.
ఖమ్మం జిల్లా, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి రంజాన్ బీ (24) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొణిజర్ల మండలం లాలాపురంలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంజాన్ బీ మృతిచెందింది. ఆమెతో పాటు చిన్న కుమారుడు మృతిచెందాడు. ఎనిమిదేళ్ల బాలుడు నిసాన్ ఉద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మృతిచెందాడు. వారి ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. బావ వేధింపులు తాళలేక రంజాన్ బీ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందగానే కొణిజర్ల పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు
ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News