పులిగుండాల సందర్శకులకు హైటెక్ సౌకర్యాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:41 AM
మండలంలోని కనకగిరి గుట్టల్లోని పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు అటవీశాఖ అధికారులు హైటెక్ సౌకర్యాలు కల్పించారు.
అక్కడే బస చేసేందుకు అధికారుల ఏర్పాట్లు
రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల రద్దీ
పెనుబల్లి(ఖమ్మం): మండలంలోని కనకగిరి గుట్టల్లోని పులిగుండాల(Puligundala) ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు అటవీశాఖ అధికారులు హైటెక్ సౌకర్యాలు కల్పించారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సంపన్నులు సైతం బస చేసేవిధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పులిగుండాల సందర్శకులకు అటవీ సమీపంలో ముఖద్వారాన్ని ఏర్పాటుచేసి అక్కడనే రాత్రి బస చేసి ఉదయాన్నే అటవీ ప్రాంతంలో ఉన్న పశుపక్షాదులతోపాటు ప్రకృతి ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు జంగిల్ సఫారీ, బోటు షికారు ఏర్పాటు చేయడంతో సందర్శకుల రద్దీ పెరిగింది.
గతంలో కేవలం పులిగుండాల ప్రాజెక్టు వరకు మాత్రమే అదీ కూడా పండుగ, సెలవు రోజుల్లో మాత్రమే సందర్శకులు వచ్చి వెళ్లేవారు. కానీ గత ఏడాది కాలంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సందర్శకులకు ఎకోటూరిజం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడంతో.. పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. గతంలో అడవిలోకి వెళ్లేందుకు నడకదారిన వెళ్లే వారికి మాత్రమే అవకాశం ఉండే ది. కానీ ఇప్పుడు అటవీశాఖ జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంపన్న వర్గాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాత్రి బస చేసేందుకు హట్స్‌ను ఏర్పాటు చేయడం.. వాటిలోనూ ఏసీలు, హోమ్‌బెడ్స్, అత్యాధునిక సౌకర్యాలతో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు.
దీంతో సామాన్య, మధ్యతరగతి వారే కాకుండా అత్యంత సంపన్నులు సైతం బస చేసేవిధంగా హట్స్‌ను ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన నిపుణులు నిర్మించారు. అటవీ ప్రాంతంలోనూ పులిగుండాల నుంచి చండ్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని వీరభద్రస్వామి ఆలయం వరకు అటవీశాఖ ప్రత్యేక వాహనాల్లో సందర్శకులను తీసుకెళ్లడం.. అడవిలోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శకులకు చూపిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News