Share News

రెవెన్యూ శాఖలో కోర్టు కేసులు.. పారదర్శకంగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:17 AM

రెవెన్యూ శాఖలో కోర్టు కేసులకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేసిన ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు.

రెవెన్యూ శాఖలో కోర్టు కేసులు.. పారదర్శకంగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని
AP Assembly Session

అమరావతి, మార్చి 4: ఏపీ శాసనసభలో(AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో కోర్టు కేసులపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రశ్న లేవనెత్తారు. రెవెన్యూ శాఖలో భారీగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. కబ్జాదారులు రెచ్చిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరముందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.


దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. రెవెన్యూ శాఖలో మొత్తం 32 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ కేసుల పర్యవేక్షణ కోసం లీగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. కేసులను త్వరగా పరిష్కరించేందుకు తహసీల్దార్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చామని చెప్పారు. కేసులు తేల్చేందుకు హైకోర్టు స్థాయిలో కూడా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. సీసీఎల్‌ఏ ఈ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కోర్టు ధిక్కరణ రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పారదర్శకంగా కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కింద స్థాయి అధికారులకు కేసులు త్వరగా పరిష్కరించటంపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 10:33 AM