ముస్లింలను మోసం చేసిన వైసీపీ, టీడీపీ: షర్మిల
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:47 AM
వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ముస్లింలను మోసం చేశాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ముస్లింలను మోసం చేశాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింల ప్రార్థనలు ఫలించాలని, అల్లా దయ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు.